LOADING...
Syria: సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు
సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు

Syria: సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2026
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

సిరియాలో స్థిరపడిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్‌) ఉగ్రవాద ముఠాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా అమెరికా సైన్యం భారీ స్థాయిలో దాడులు చేపట్టింది. అమెరికా తూర్పు తీర కాలమానం ప్రకారం మధ్యాహ్న సమయంలో ఈ దాడులు నిర్వహించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. సిరియా అంతటా విస్తరించిన ఐసిస్ నెట్‌వర్క్‌ను మట్టికరిపించేందుకు ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ మెరుపు దాడుల్లో జరిగిన ప్రాణనష్టం వివరాలను పెంటగాన్ ఇప్పటివరకు వెల్లడించలేదు. గతేడాది డిసెంబర్ 13న సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు, ఒక అనువాదకుడు మృతి చెందిన ఘటనను అమెరికా తీవ్రంగా పరిగణించింది.

Details

 ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో  వెయ్యిమంది పాల్గొన్నట్లు సమాచారం

ఆ ఘటనకు ప్రతిస్పందనగా, తమ వ్యూహాత్మక సైనిక చర్యలలో భాగంగా తాజా దాడులు నిర్వహించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం సిరియాలో సుమారు వెయ్యి మంది అమెరికా సైనికులు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని సమాచారం. కొన్ని నెలలుగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఐసిస్ అనుమానితులపై గగనతలతో పాటు భూతల దాడులను కొనసాగిస్తున్నాయి.

Advertisement