టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్
వరుస భూకంపాలతో అల్లాడుతున్న టర్కీకి ఆపన్న హస్తం అందించడం కోసం ప్రత్యేక విమానాన్ని భారత్ పంపింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌తో పాటు నైపుణ్యం కలిగిన డాగ్ స్క్వాడ్‌లు, వైద్య సామగ్రి, అధునాతన డ్రిల్లింగ్ పరికరాలు, ఇతర కీలకమైన సాధనాలతో ఈ విమానం బయలుదేరింది. మానవతా విపత్తు సాయం కింద భారత్ ఈ చర్యలు తీసుంటున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి బాగ్చి చెప్పారు. ప్రస్తుతం మొదటి బ్యాచ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌తో పాటు బ్యాచ్ భూకంప సహాయ సామగ్రితో కూడిన విమానం బయలుదేరినట్లు ఆయన వెల్లడించారు. ఈ విమానం గాజియాంటెప్‌లో సహాయ చర్యల కోసం వెళ్లింది.
టర్కీ, సిరియాలో భూకంపాలపై ప్రాధాని మోదీ దిగ్భ్రాంతి
టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపాలపై ప్రాధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భూకంపాల వల్ల సంభవించిన పరిణామాలను ఎదుర్కోవడంలో సాధ్యమైనంత వరకు ఆ దేశాలకు సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. భూకంపం కారణంగా టర్కీ,సిరియాలో 4,372 మంది చనిపోయినట్లు, ఈ సంఖ్య 20వేలకు చేరొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. మంగళవారం ఉదయం నాటికి టర్కీలో మృతుల సంఖ్య 2,921కి చేరినట్లు టర్కీ విపత్తు సేవల అధిపతి యూనస్ సెజర్ తెలిపారు. మొత్తం 15,834 మంది గాయపడినట్లు వెల్లడించారు. సిరియాలో 1,451 మరణాలు సంభవించగా, 3,531 మంది గాయపడినట్లు సీఎన్ఎన్ నివేదించింది.