Page Loader
ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
కర్ణాటక తుమకూరులో ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Stalin
Feb 06, 2023
06:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం. ఇది లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలో లైట్ యుటిలిటీ హెలికాప్టర్‌ను ప్రధాని ఆవిష్కరించారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధన దిశగా సాగుతున్న ప్రయాణంలో హెచ్‌ఏఎల్‌ హెలికాప్టర్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవం ఓ మైలురాయి అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ప్రధాని మోదీ

2016లో హెలికాప్టర్ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ శంకుస్థాపన

2016లో తుమకూరు హెలికాప్టర్ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇది హెలికాప్టర్‌లను నిర్మించే సామర్థ్యాన్ని, పర్యావరణ వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం దీని నిర్మాణాన్ని చేపట్టింది. లైట్ కంబాట్ హెలికాప్టర్ (ఎల్‌సీహెచ్), ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్ (ఐఎంఆర్‌హెచ్) వంటి ఇతర హెలికాప్టర్‌లను తయారు చేయడానికి కాకుండా మరమ్మతుల కోసం భవిష్యత్తులో ఈ ఫ్యాక్టరీని విస్తరించనున్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఉత్పత్తి చేసే సివిల్ ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లను ఎగుమతి చేసే ఆలోచనలో కూడా కేంద్రం ఉంది. ఈ ఫ్యాక్టరీ భారతదేశ అవసరాలను స్వదేశీ పద్ధతిలో తీర్చడానికి వీలు కల్పిస్తుందని కేంద్రం భావిస్తోంది. ఈ ప్లాంట్‌ ఏర్పాటు ద్వారా దేశంలో హెలికాప్టర్ రూపకల్పన, అభివృద్ధి, తయారీలో స్వయం ప్రతిపత్తిని సాధించిన దేశంగా భారత్ నిలుస్తుంది.