NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / #NewsBytesExplainer: సిరియాలో తిరుగుబాటు  ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుంది.. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి?
    తదుపరి వార్తా కథనం
    #NewsBytesExplainer: సిరియాలో తిరుగుబాటు  ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుంది.. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి?
    సిరియాలో తిరుగుబాటు.. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి?

    #NewsBytesExplainer: సిరియాలో తిరుగుబాటు  ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుంది.. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 10, 2024
    01:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    1957వ సంవత్సరంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అమెరికా ప్రయాణానికి వెళ్లేటప్పుడు మార్గమధ్యంలో సిరియా రాజధాని డమాస్కస్‌ను సందర్శించారు.

    ఈ సంఘటన చారిత్రాత్మకంగా నిలిచింది, ఎందుకంటే అప్పటికే భారత్-సిరియా మధ్య ఏడేళ్ల దౌత్య సంబంధాలున్నాయి.

    కశ్మీర్ సమస్యపై సిరియా భారత్‌కు బలమైన మద్దతు ఇచ్చింది. నెహ్రూ సందర్శనకు గుర్తుగా డమాస్కస్‌లోని ఒక వీధికి ఆయన పేరు పెట్టారు.

    గడిచిన దశాబ్దాల్లో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నా, ఇరు దేశాల స్నేహ సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపలేదు.

    అయితే, బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఈ సంబంధాలు ఎలా ఉంటాయనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

    వివరాలు 

    కశ్మీర్‌ అంశంపై భారత్‌కు సిరియా మద్దతు 

    హఫీజ్ అల్ అసద్ పాలన నుంచీ బషర్ అల్ అసద్ పాలన వరకు సిరియా భారతదేశానికి కశ్మీర్ సమస్య సహా పలు అంశాల్లో మద్దతు అందించింది.

    కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వైఖరికి వ్యతిరేకంగా నిలిచాయి . అయితే సిరియా భారతదేశానికి ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చిన కొన్ని దేశాలలో ఒకటిగా నిలిచింది.

    ఇరు దేశాల మధ్య సారూప్యత

    అసద్ లౌకిక ప్రభుత్వం, భారతదేశం పాటించే సిద్ధాంతాల మధ్య ఉన్న సామాన్యత ఇరు దేశాల బలమైన సంబంధాలకు పునాదిగా నిలిచింది.

    2019లో భారతదేశం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు, సిరియా దాన్ని భారత అంతర్గత సమస్యగా గుర్తించి మద్దతు తెలిపింది.

    వివరాలు 

    సిరియాకు తీవ్రవాద గ్రూపుల ముప్పు 

    సిరియాలో తీవ్రవాద గ్రూపుల పెరుగుదల భారతదేశానికి సవాళ్లను సృష్టించే అవకాశాలు ఉన్నాయి.

    గతంలో రష్యా,ఇరాన్ మద్దతుతో సిరియా ఐఎస్‌ఐఎస్ వంటి ఉగ్రవాద గ్రూపులను అణిచివేయగలిగింది.

    కానీ అసద్ ప్రభుత్వం తక్కువ బలహీనంగా మారిన నేపథ్యంలో ఈ గ్రూపులు తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇది మధ్యప్రాచ్యంపై ప్రభావం చూపిస్తుంది.

    ఇది గమనించిన భారతదేశం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సిరియా తీర్మానాలకు మద్దతు ఇచ్చింది.

    సిరియా తీర్మానానికి భారత్‌ మద్దతు

    అంతర్యుద్ధం ఉధృతమైన కాలంలో కూడా డమాస్కస్‌లో తన రాయబార కార్యాలయాన్ని కొనసాగించింది.

    2010లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సిరియాను సందర్శించి గోలాన్ హైట్స్ విషయంలో భారత వైఖరిని పునరుద్ఘాటించారు.

    వివరాలు 

    ఎగుమతులు.. దిగుమతులు ఇలా.. 

    2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి సిరియాలో పర్యటించి బయోటెక్నాలజీ, చిన్న పరిశ్రమలు, విద్య వంటి రంగాల్లో ఒప్పందాలను కుదుర్చారు.

    సిరియాలో బయోటెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు భారత్ సహకారం అందించింది.

    2008లో బషర్ అల్ అసద్ భారత్‌ను సందర్శించగా, ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డాయి.

    భారతదేశం సిరియాకు వస్త్రాలు, మందులు, యంత్రాలు ఎగుమతి చేస్తుండగా, సిరియాలోనుండి రాక్ ఫాస్ఫేట్, కాటన్ వంటి ముడి పదార్థాలు దిగుమతి అవుతాయి.

    ఈ సంబంధాలు ఇరుదేశాల భవిష్యత్తు సహకారానికి బలమైన మద్దతుగా నిలుస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సిరియా
    భారతదేశం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    సిరియా

    టర్కీ, సిరియాలో ప్రకృతి విలయం: వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం టర్కీ
    టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్ భారతదేశం
    టర్కీలో 5.4 తీవ్రతతో మరో భూకంపం, 5,000 దాటిన మరణాలు టర్కీ
    భూకంప బీభత్సం: టర్కీ, సిరియాలో 8వేలకు చేరిన మరణాలు టర్కీ

    భారతదేశం

    Iran-Israel war: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారతీయ స్టాక్ మార్కెట్, బంగారం ధరలను ఎలా ప్రభావితం చేస్తుంది  ఇరాన్
    Arti Sarin: ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌కు అధిపతి అయిన మొదటి మహిళ;ఈ వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ ఎవరు? భారతదేశం
    Cerebral Palsy Day: ఇవాళ వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే.. లక్షణాలు, చికిత్స మార్గాలను తెలుసుకోండి ప్రపంచం
    MG Windsor: ఎంజీ మోటార్ సరికొత్త రికార్డు.. 24 గంటల్లో 15వేల బుకింగ్స్ ఎలక్ట్రిక్ వాహనాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025