LOADING...
IND vs SA: భారత్‌తో పర్యటనకు సిద్ధమైన సౌతాఫ్రికా.. జట్టును ప్రకటించిన బావుమా సేన!
భారత్‌తో పర్యటనకు సిద్ధమైన సౌతాఫ్రికా.. జట్టును ప్రకటించిన బావుమా సేన!

IND vs SA: భారత్‌తో పర్యటనకు సిద్ధమైన సౌతాఫ్రికా.. జట్టును ప్రకటించిన బావుమా సేన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2025
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టుతో రాబోయే పర్యటన కోసం సౌతాఫ్రికా జట్టు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్‌ 14 నుంచి కోల్‌కతాలో తొలి టెస్టు ప్రారంభం కానుండగా, రెండో టెస్టు నవంబర్‌ 22 నుంచి గువాహటిలో జరుగనుంది. ఇదే సందర్భంగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు టెస్టు సిరీస్‌ కోసం 15 మంది ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. గాయాల కారణంగా ఇటీవల పాకిస్థాన్‌తో సిరీస్‌కు దూరమైన కెప్టెన్‌ తెంబా బావుమా తిరిగి ఫిట్‌ అయ్యి జట్టును మరోసారి ముందుండి నడిపించనున్నారు.

Details

దక్షిణాఫ్రికా టెస్టు జట్టు ఇదే

పాక్‌ సిరీస్‌లో పాల్గొన్న పలువురు ఆటగాళ్లు ఈ జట్టులో కొనసాగారు. అందులో స్టార్‌ ప్లేయర్లు మార్కో యాన్సెన్‌, కగిసో రబాడ‌, ఐడెన్‌ మార్క్రమ్‌, కేశవ్‌ మహరాజ్‌ వంటి వారు ఉన్నారు. బ్యాటింగ్‌ విభాగాన్ని టోనీ డి జోర్జి, ర్యాన్ రికెల్‌టన్, డెవాల్డ్ బ్రెవిస్‌ బలపరచనున్నారు. స్పిన్‌ విభాగంలో సైమన్ హర్మర్‌, ముత్తుసామి ద్వయం కీలక పాత్ర పోషించనున్నారు. తెంబా బావుమా (కెప్టెన్‌), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, జుబేర్ హంజా, సైమన్ హర్మర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, కగిసో రబాడ, ర్యాన్ రికెల్‌టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరినె. భారత్‌ పర్యటనలో సౌతాఫ్రికా జట్టు బలంగా కనిపిస్తోంది.