LOADING...
Syria: సిరియా టార్టస్ ప్రావిన్స్‌లో ఘర్షణ.. 17 మంది మృతి 
సిరియా టార్టస్ ప్రావిన్స్‌లో ఘర్షణ.. 17 మంది మృతి

Syria: సిరియా టార్టస్ ప్రావిన్స్‌లో ఘర్షణ.. 17 మంది మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 26, 2024
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

సిరియాలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వ హయాంలో అకృత్యాలకు పాల్పడిన ఒక అధికారిని అరెస్టు చేయడానికి జరిగిన ప్రయత్నం కారణంగా ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. టార్టస్‌ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘర్షణల సమయంలో, 17 మంది చనిపోయారని అక్కడి మీడియా వెల్లడించింది. అదే సమయంలో, సిరియన్‌ జనరల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ లో 14 మంది మరణించారని సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ పేర్కొంది.

వివరాలు 

సిరియాలో తాత్కాలికంగా కొత్త ప్రభుత్వం

ఇదిలా ఉండగా, ఇటీవల తిరుగుబాటుదారుల కారణంగా మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ దేశం విడిచి పారిపోయి, రష్యాలో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిరియాలో తాత్కాలికంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. ఈ ప్రభుత్వం, అసద్‌ హయాంలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన అధికారులను లక్ష్యంగా చేసుకుని చర్యలు చేపడుతోంది.