
USA: సిరియాపై విరుచుకుపడిన అమెరికా.. ఐసీసీ స్థావరాలపై బాంబుల మోత
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న వేళ, అమెరికా సిరియాపై దాడులు కొనసాగిస్తూనే ఉంది.
ఐసిస్ ఉగ్రస్థావరాలను లక్ష్యంగా అమెరికా సెంట్రల్ కమాండ్ శుక్రవారం నుంచి వరుస గగనతల దాడులు జరిపింది.
ఈ దాడులు అమెరికా మిత్రదేశాలపై ఐసిస్ దాడులు చేసేందుకు పన్నాగం పన్నుతోందన్న సమాచారంతోనే జరిపినట్లు తెలుస్తోంది.
ఈ దాడుల్లో సిరియాలోని సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.
Details
అమెరికా
సెప్టెంబర్ చివరిలో కూడా ఐసిస్ స్థావరాలపై దాడులు జరిపిన అమెరికా, ఆ దాడుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ప్రకటించింది. వారిలో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు వివరించింది.
తాజా దాడులతో ఐసిస్ శక్తిసామర్థ్యాలు తగ్గిపోయినట్లు అమెరికా ప్రకటించింది.
తమ ప్రయోజనాలు, మిత్రదేశాల భద్రతకు విఘాతం కలిగించే ఉగ్రవాదులను సహించమని కఠినంగా హెచ్చరించింది.
ఐసిస్ గ్రూప్ మళ్లీ పెద్దఎత్తున భూభాగాన్ని కబ్జా చేయకుండా నిరోధించేందుకు, సిరియాలో దాదాపు 900 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు అమెరికా వెల్లడించింది.