Page Loader
Syria: సిరియా నూతన ప్రభుత్వంలో ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు!
సిరియా నూతన ప్రభుత్వంలో ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు!

Syria: సిరియా నూతన ప్రభుత్వంలో ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 06, 2025
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుగుబాటుదారులు సిరియాను ఆక్రమించడంతో, దేశ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ రష్యాకు పారిపోయిన విషయం తెలిసిందే. దానితో పాటు అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ కొత్త ప్రభుత్వంలో, ఉద్యోగులకు 400 శాతం వేతన పెంపు చేయనున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మద్‌ అబ్జాద్‌ ప్రకటించారు. ఈ పెంపునకు సంబంధించి 1.65 ట్రిలియన్‌ సిరియన్ పౌండ్ల వేతనాలను దేశ వనరుల ద్వారా సమకూర్చగలిగే అవకాశం ఉందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి స్థిరపర్చడం కోసం వేతన పెంపు అమలు చేస్తున్నామని అబ్జాద్‌ తెలిపారు.

వివరాలు 

విదేశాల్లోని 400 మిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులు 

కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న అంతర్యుద్ధం కారణంగా, సిరియా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ, తమ కొత్త ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందిస్తామని అరబ్‌ దేశాలు హామీ ఇచ్చినట్లు అబ్జాద్‌ చెప్పారు. అలాగే, సిరియాకు చెందిన విదేశాల్లోని 400 మిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను తిరిగి సొంతం చేసుకునే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు.