Israel Strikes-On Lebanon: లెబనాన్ పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
ఈ వార్తాకథనం ఏంటి
లెబనాన్(Lebanon)దేశం పై ఇజ్రాయెల్(Israel)క్షిపణులతో విరుచుకుపడింది .
లెబనాన్ దేశం ఇజ్రాయెల్ పై 35 క్షిపణులతో దాడి చేసిన నేపథ్యంలో లెబనాన్ పై ఇజ్రాయిల్ ప్రతిదాడులు చేసింది.
సోమవారం యూదులు మధ్యాహ్నం భోజనానికి కూర్చున్న సమయంలో లెబనాన్ దేశం 35 క్షిపణులతో దాడి చేసింది.
ఈ దాడులకు తామే బాధ్యులమని హిజ్బుల్లా సంస్థ ప్రకటించుకుంది.
ఈ దాడిలో తాము 35 కత్యూష రాకెట్లను ప్రయోగించినట్లు వెల్లడించింది.
దక్షిణ లెబనాన్ లోని గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ చేసిన దాడులకు ప్రతిస్పందనగానే ఈ క్షిపణి దాడులను చేసినట్లు హిజ్బుల్లా పేర్కొంది.
ఉత్తర ఇజ్రాయలలోని ఆర్మీ ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని హిజ్బుల్లా సంస్థ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Israel-Lebnon-War
హిజ్బుల్లా దాడులకు ప్రతి స్పందనగా...
ఉత్తర ఇజ్రాయెల్ లోని ఆర్మీ ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని హిజ్బుల్లా సంస్థ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది .
అయితే లెబనాన్ చేసిన దాడుల్లో ఎవరు గాయపడలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.
లెబనాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ కూడా ధీటుగా స్పందించింది.
దక్షిణ లెబనాన్ లోని హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ప్రతి దాడులకు పాల్పడింది.
హిజ్బుల్లా కార్యకర్తల సమావేశమైన రెండు భవనాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది.
ఇజ్రాయెల్ కు అదనపు ఆర్మీ సహాయం కోసం బిలియన్ డాలర్లను అమెరికా కేటాయిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
తాజా దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడుల వీడియో
לפני זמן קצר מטוסי קרב של חיל האוויר תקפו תשתית טרור של ארגון הטרור חיזבאללה בדרום לבנון.
— צבא ההגנה לישראל (@idfonline) April 22, 2024
כמו כן, מוקדם יותר היום הותקפו שני מבנים צבאיים במרחבים ארזון ואל עדייסא, בהם פעלו מחבלי הארגון>> pic.twitter.com/QSLNA6Jzi8