భూకంప బీభత్సం: టర్కీ, సిరియాలో 8వేలకు చేరిన మరణాలు
వరుస భూకంపాల ధాటికి టర్కీ, సిరియాలో మరణాలు క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి. బుధవారం నాటికి 8,000 మందికిపైగా మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నారు. టర్కీలో 5,894 మంది, సిరియాలో 2,032 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. అనధికారికంగా మరణాలు ఇంకా ఎక్కువే ఉండోచ్చొని మీడియా చెబుతోంది. భూకంపాల ధాటికి వేలాది భవవాలు నేమట్టమయ్యాయి. అయితే ఆ భవనాల శిథిలాల కింద వందలాది మృత దేహాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. టర్కీ, సిరియాలకు ఆపన్న హస్తం అందించేందుకు భారత ముందుకొచ్చింది. సహాయ సామగ్రి, పరికరాలు, సిబ్బంది వైద్య బృందాలను ఇప్పటికే ఇరు దేశాలకు పంపింది. భూకంపం ప్రభావిత ప్రాంతాలైన 10 ప్రావిన్సుల్లో వచ్చే మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించామని టర్కీ అధికారులు ప్రకటించారు.
చలి, వర్షంతో రెస్క్యూ ఆపరేషన్లకు ఆటంకం
టర్కీలో 11,342 భవనాలు కూలిపోయినట్లు, 8000వేల మందిని శిథిలాల నుంచి రక్షించినట్లు టర్కీ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది. దాదాపు 3,80,000 మంది టర్కీ పౌరులు ప్రభుత్వ ఆశ్రయాలు, హోటళ్లలో ఆశ్రయం పొందారు. టర్కీలో గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, సిరియాలో వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్లకు ఆటంకం కలుగుతుంది. లక్షలాది మంది సిరియన్ శరణార్థులు టర్కీలోని గాజియాంటెప్‌లో వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతున్నారు. భూకంపాల కారణంగా అతి ఎక్కు వ నష్టం ఈ ప్రాంతానికే జరిగింది. ఇదిలి ఉంటే, సిరియాకు భారత్ ఆరు టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ని పంపింది. ఇందులో మూడు ట్రక్కుల సాధారణ, అత్యవసర వినియోగ మందులు, సిరంజిలు, ఈసీజీ యంత్రాలు, మానిటర్లు, ఇతర అవసరమైన వైద్య వస్తువులతో సహా పరికరాలు ఉన్నాయి.