LOADING...
Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు శుభవార్త.. అదనంగా రూ.8 వేల కోట్ల ఆర్థికసాయం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు శుభవార్త.. అదనంగా రూ.8 వేల కోట్ల ఆర్థికసాయం

Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు శుభవార్త.. అదనంగా రూ.8 వేల కోట్ల ఆర్థికసాయం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 01, 2026
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన రూ.11,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీతో కొంత స్థిరత్వం సాధించిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ (VSP) కార్యకలాపాలను మరింత సుస్థిరంగా కొనసాగించేందుకు మరో రూ.8,097 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన ఫైల్‌ను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆమోదించి, తదుపరి చర్యల కోసం ఆర్థిక శాఖకు పంపినట్లు సమాచారం. ఆర్థిక శాఖ వ్యయ విభాగం ఆమోదం లభించిన వెంటనే ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్‌లో మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు ప్రారంభమై కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

వివరాలు

తొలిదశలో రూ.11,440 కోట్ల ప్యాకేజీ మంజూరు

ఉక్కు ఉత్పత్తి, అలాగే అమ్మకాలు కూడా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సానుకూల పరిస్థితి దీర్ఘకాలం కొనసాగేందుకు అవసరమైన మద్దతు అందించడమే లక్ష్యంగా కేంద్రం రెండో దశ ప్యాకేజీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గతంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంతో జరిపిన సంప్రదింపుల ఫలితంగా తొలిదశలో రూ.11,440 కోట్ల ప్యాకేజీ మంజూరైంది. అందులో రూ.10,300 కోట్లు ఈక్విటీ రూపంలో ఇవ్వగా, మరో రూ.1,140 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణాలను 7% నాన్-క్యుములేటివ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల రూపంలో సమకూర్చారు. ఇప్పుడు ప్రతిపాదిత రూ.8,097 కోట్ల నిధులను కూడా ఈక్విటీ రూపంలోనే సమకూర్చాలని కేంద్ర ఉక్కుశాఖ నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement