NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / టర్కీలో 4.7 తీవ్రతతో మరో భూకంపం, 34,000 దాటిన మృతుల సంఖ్య
    తదుపరి వార్తా కథనం
    టర్కీలో 4.7 తీవ్రతతో మరో భూకంపం, 34,000 దాటిన మృతుల సంఖ్య
    టర్కీలో 4.7 తీవ్రతతో సంభవించిన మరో భూకంపం

    టర్కీలో 4.7 తీవ్రతతో మరో భూకంపం, 34,000 దాటిన మృతుల సంఖ్య

    వ్రాసిన వారు Stalin
    Feb 13, 2023
    11:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టర్కీలో ఆదివారం మరో భూకంపం సంభవించింది. టర్కీ, సిరియాలో సరిహద్దులో రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భయంకరమైన భూకంపం వచ్చిన వారం తర్వాత ఇది సంభవించింది.

    టర్కీలో తాజాగా వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతగా నమోదైంది. భూకంప కేంద్రం దక్షిణ నగరమైన కహ్రామన్మరాస్ సమీపంలో కేంద్రీకృతమైంది. ఇటీవల సంభవించిన భూకంపాల ధాటికి అత్యంత దెబ్బతిన్న నగరాల్లో ఇది ఒకటి.

    టర్కీ, సిరియాలో కలిసి ఇప్పటి వరకు 34,000మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. మరో 10వేల మందికి పైగా గాయపడినట్లు వెల్లడించారు.

    భూకంపం

    రెచ్చిపోతున్న దొంగలు, 57మంది అరెస్టు

    భూకంప ప్రభావిత ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు కూలిపోయి, టెంట్ల కింద, కార్లలో నిరాశ్రయులు నివసిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బంగారంతో పాటు విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు.

    దోపిడీదారుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. లూటీకి పాల్పడిన 57మందిని అరెస్టు చేసినట్లు న్యాయ శాఖ మంత్రి బెకిర్ బోజ్‌డాగ్ తెలిపారు.

    భూకంపం కారణంగా కుదైలైన టర్కీ, సిరియాకు సాయం చేసేందుకు ఖతార్ ముందుకొచ్చింది. ఫిఫా ప్రపంచ కప్ సందర్భంగా ఉపయోగించిన 10,000 క్యాబిన్లు, కారవాన్లను టర్కీ, సిరియాకు పంపనున్నట్లు ఖతార్ అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టర్కీ
    భూకంపం
    సిరియా

    తాజా

    Vijayawada: విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి?  విజయవాడ సెంట్రల్
    Best Electric Scooters : సిటీ డ్రైవింగ్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంగ్ రేంజ్ తో ఖర్చులు తగ్గించుకోండి! ఎలక్ట్రిక్ స్కూటర్
    Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు అయోధ్య
    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు

    టర్కీ

    ఎనిమిదో నిజాం ముకరం జా కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    టర్కీలో 7.8 తీవ్రతతో భారీ భూకంకం, భవనాలు నేలకూలి 90 మంది మృతి భూమి
    టర్కీ, సిరియాలో ప్రకృతి విలయం: వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం భూమి
    టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్ భారతదేశం

    భూకంపం

    టర్కీ, సిరియాలో మరణ మృదంగం: 15,000 దాటిన భూకంప మరణాలు సిరియా
    టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు సిరియా
    పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు ప్రకటన
    టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ ప్రకటన

    సిరియా

    టర్కీలో 5.4 తీవ్రతతో మరో భూకంపం, 5,000 దాటిన మరణాలు టర్కీ
    భూకంప బీభత్సం: టర్కీ, సిరియాలో 8వేలకు చేరిన మరణాలు టర్కీ
    టర్కీలో 8ఏళ్ల బాలికను కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 24వేలు దాటిన మృతులు భూకంపం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025