అఫ్గానిస్థాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత
అఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. అఫ్గాన్‌లోని ఫైజాబాద్‌లో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు చెప్పారు. అఫ్గానిస్థాన్‌కు ఈశాన్య నగరమైన ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ ప్రకంపనలు ఉదయం 6:47 గంటలకు ఈ ప్రాంతాన్ని తాకినట్లు పేర్కొంది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.
నెల రోజుల వ్యవధిలోనే రెండో భూకంపం
నెల రోజుల వ్యవధిలోనే అఫ్గానిస్థాన్‌లో ఇది రెండో భూకంపం కావడం గమనార్హం. అంతకుముందు జనవరి 22న, ఆదివారం ఉదయం 9:04 గంటలకు అఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 79 కి.మీ దూరంలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.