
Israel: టార్టస్ నగరంపై ఇజ్రాయెల్ భారీ దాడి.. 2012 తర్వాత సిరియాలో మొదటిసారి
ఈ వార్తాకథనం ఏంటి
సిరియాలోని టార్టస్ నగరంపై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది.
ఇది ఇజ్రాయెల్ నుండి సిరియాకు గానూ అత్యంత తీవ్ర దాడిగా నమోదైంది.
ఈ దాడి కారణంగా భూమి కంపించడం, రిక్టర్ స్కేల్‌పై 3.0 తీవ్రతతో ప్రకంపనలు నమోదవడం, భూకంపం వంటి శబ్దాలు వినిపించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ పేలుడుతో ఏర్పడిన అగ్నిగోళం కొన్ని కిలోమీటర్ల వరకు కనిపించింది. ఈ స్థావరంలోని ఆయుధాగారాలు, రష్యా నౌకాదళానికి చెందిన వివిధ సరఫరాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
1971 నుండి ఈ నగరంలో రష్యా నౌకాదళం స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఇది సిరియా, రష్యా మధ్యదరా సముద్రంలో ప్రవేశించేందుకు ప్రధాన మార్గం.
Details
రష్యాకు 49 సంవత్సరాల పాటు లీజుకు
గతంలో రష్యా సిరియా సర్కారుకు ఆయుధాల సరఫరా చేస్తుండగా, 2017లో ఈ స్థావరాన్ని రష్యాకు 49 సంవత్సరాల లీజుకు ఇచ్చింది.
అయితే బషర్ అల్-అసద్ సర్కారు కూలిపోవడంతో రష్యా ఈ స్థావరాన్ని ఖాళీ చేసింది. ఇటీవల రష్యా యుద్ధనౌకలు తిరిగి ప్రయాణంలో ఉన్నట్లు సమాచారం.
ఇజ్రాయెల్ ప్రస్తుతం సిరియాలోని గోలన్ హైట్స్‌పై దృష్టి పెట్టింది, 1967లో ఈ భూభాగాన్ని సిరియాను ఆక్రమించిన ఇజ్రాయెల్, ఈ ప్రాంతాన్ని తాజాగా తన భూభాగంగా ప్రకటించింది.
గోలన్ హైట్స్‌లో జనాభా పెంచడానికి, ఇజ్రాయెల్ ప్రభుత్వం 11 మిలియన్ డాలర్లను కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది.
2019లో అమెరికా ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ భూభాగంగా గుర్తించిన సంగతి తెలిసిందే.