
Syrian Rebel Flag: ఢిల్లీలోని సిరియన్ ఎంబసీలో కొత్త తిరుగుబాటు జెండా ఆవిష్కరణ..
ఈ వార్తాకథనం ఏంటి
అరబ్ రిపబ్లిక్‌లో బషర్ అల్-అస్సాద్ పాలనను తిరుగుబాటు దళాలు తొలగించారు.
ఈ ఘటన తర్వాత, న్యూఢిల్లీలో ఉన్న సిరియన్ ఎంబసీ వద్ద రెబల్స్ వారి కొత్త జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ జెండా ఆవిష్కరణతో సిరియాలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు భావిస్తున్నారు.
ఆ జాతీయ జెండా ఆకుపచ్చ, తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో రూపొందించబడింది.
గతంలో ఈ జెండా ప్రతిఘటనకు ప్రతీకగా ఉండేది. సిరియన్ అంతర్యుద్ధంలో ఈ జెండాకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
అసద్ పాలన ముగిసిన తర్వాత, సిరియా కొత్త అధికారిక జాతీయ చిహ్నాన్ని ఆమోదించింది. ఈ మార్పుతో, అసద్ కుటుంబం 50 సంవత్సరాల పాలనకు ముగింపు పలికినట్లు చెబుతున్నారు.
వివరాలు
కొత్త జెండాతో ప్రజలు ర్యాలీలు
సిరియాలో పాలనలో వచ్చిన మార్పులకు సంబంధించి, కొత్త జాతీయ జెండా ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా వేడుకలు జరిగాయి.
బెర్లిన్, ఇస్తాంబుల్, ఏథెన్స్ వంటి ప్రధాన నగరాల్లో ప్రజలు కొత్త జెండాతో ర్యాలీలు నిర్వహించారు.
అంతేకాక, సిరియాలో అధికారాన్ని పొందిన తిరుగుబాటుదారులకు మద్దతు ప్రకటించేందుకు జనాలు భారీగా గుమిగూడారు.
ఇదే సమయంలో, భారతదేశంలోని సిరియన్ ఎంబసీలో జెండా మార్పు దేశంలో కొత్త రాజకీయ గుర్తింపుకు సంకేతంగా నిలిచింది.
వివరాలు
జెండాలోని రంగుల అర్థాలు
ఆకుపచ్చ: స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి చిహ్నం.
తెలుపు: శాంతి,ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీక.
నలుపు: సిరియన్ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను సూచిస్తుంది.
మూడు ఎరుపు నక్షత్రాలు: ప్రజల విప్లవం,ఆదర్శాలను ప్రాతినిధ్యం వహిస్తాయి.
ఈ జెండా రూపకల్పనలో, యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ కింద సిరియా మరియు ఈజిప్ట్ యూనియన్‌కు సూచనగా రెండు ఆకుపచ్చ నక్షత్రాలు కూడా ఉన్నాయి.