సిరియాలో టెర్రర్ దాడులు.. ఘర్షణల్లో మరణించిన ఐఎస్ఐఎస్ చీఫ్ ఖురాషీ
ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబూ హుస్సేన్ అల్-హుస్సేనీ అల్ ఖురాషీ మరణించారు. గతేడాది నవంబర్ నుంచి తీవ్రవాద సంస్థకు నేతృత్వం వహిస్తున్న నాయకుడు ఖురాషీ తిరుగుబాటుదారుల ఘర్షణల్లో చనిపోయినట్లు టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్ ధృవీకరించింది. ప్రత్యర్థి HTS ఆధీనంలోని వాయువ్య సిరియాలో ఈ ఘటన జరిగింది. హయత్ తహ్రీర్ అల్-షామ్(HTS)తో జరిగిన ప్రత్యక్ష ఘర్షణలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ సంస్థ తరఫున అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ మేరకు ఇస్లామిక్ స్టేట్ గురువారం తన టెలిగ్రామ్ ఛానెల్లో ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. తదుపరి నాయకుడిగా అబూ హఫ్స్ అల్-హషిమి అల్-ఖురాషీని ప్రకటించారు. ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని జిహాదీస్ట్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్‌తో నేరుగా తలపడ్డ కారణంగా హత్యకు గురయ్యాడని సమాచారం.
విస్తారమైన భూ ఆక్రమణల తర్వాత, క్రమంగా పట్టు కోల్పోయిన ఐఎస్ఐఎస్
ఘర్షణకు గల కారణాలను మాత్రం ఇస్లామిక్ స్టేట్ ప్రతినిధి ప్రకటించలేదు.2014లో ఇరాక్, సిరియాలో అల్లర్లు పెరుగుదల తర్వాత, ఐఎస్ విస్తారమైన భూభాగాన్ని ఆక్రమించింది. అయితే, 2017లో ఇరాక్‌లో, 2019లో సిరియాలో ఓటమితో గత రెండేళ్లలో ఆ సంస్థ నియంత్రణ కోల్పోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 2019 అక్టోబర్‌లో ఇడ్లిబ్‌లో అబూ బాకర్ అల్ బాగ్దాదీ హతమయ్యారు. ఐఎస్ఐఎస్ సంస్థకు బాకర్ అలీ నాలుగో ఖలీఫ్ గా పనిచేశారు. మరోవైపు స్లీపర్ సెల్స్ ఇప్పటికీ 2 దేశాల్లో దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఐఎస్ నాయకుడు అబూ హసన్ అల్-హషిమీ అల్-ఖురాషి హతమైనట్లు తెలిపింది. అతని పూర్వీకుడు అబూ ఇబ్రహీం అల్-ఖురాషి 2022 ఫిబ్రవరిలో ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో అమెరికా దాడిలో హత్యకు గురయ్యాడు.