Page Loader
Bashar Al-Assad: సిరియా అధ్యక్షుడి విమానం కూలిపోయినట్లు ప్రచారం?
సిరియా అధ్యక్షుడి విమానం కూలిపోయినట్లు ప్రచారం?

Bashar Al-Assad: సిరియా అధ్యక్షుడి విమానం కూలిపోయినట్లు ప్రచారం?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2024
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా ప్రచారం జరుగుతోంది. హయాత్‌ తహరీర్‌ అల్‌-షామ్‌ (హెచ్‌టీఎస్) నేతృత్వంలోని తిరుగుబాటుదారులు డమాస్కస్ నగరాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడంతో, అసద్‌ కుటుంబంతో సహా నగరాన్ని విడిచి వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఆయన ప్రయాణిస్తున్న ఐఎల్‌-76 విమానం అనూహ్యంగా 3,650 మీటర్ల ఎత్తు నుంచి 1,070 మీటర్ల ఎత్తుకి పడిపోయిందని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ల ద్వారా తెలిపింది. ఈ ఘటన లెబనాన్‌ గగనతలం పరిసర ప్రాంతంలో జరిగింది. దీనిని కూల్చివేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ గా మారిన న్యూస్