తదుపరి వార్తా కథనం

Pager attacks: పేజర్ దాడుల్లో ఇజ్రాయెల్ పాత్ర ఉన్నట్లు నెతన్యాహు అంగీకారం
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 11, 2024
08:20 am
ఈ వార్తాకథనం ఏంటి
లెబనాన్, సిరియాలపై జరిగిన తాజా పేజర్ దాడులు ఆ రెండు దేశాలను వణికించాయి. ఈ దాడుల్లో అనేక మంది హెజ్‌బొల్లా కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ పేజర్ దాడులకు తానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించారు.
వివరాలు
ఘటన వెనుక ఇజ్రాయెల్ హస్తం
సెప్టెంబర్ 17న లెబనాన్, సిరియాలో వందల సంఖ్యలో పేజర్లు పేలిపోవడంతో 40 మంది మరణించగా, దాదాపు 3 వేల మంది గాయపడ్డారు.
ఈ ఘటన వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆరోపణలు వినిపించాయి.
లెబనాన్ ఇటీవలే ఐరాసకు ఈ విషయంపై ఫిర్యాదు చేస్తూ, దీనిని మానవత్వంపై దాడిగా పేర్కొంది.
హెజ్‌బొల్లా లక్ష్యంగా జరిగిన ఈ పేజర్ దాడులకు తాను అనుమతి ఇచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించారని తెలిసింది.