Page Loader
Iran Embassy: సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి.. 11మంది మృతి 
సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి.. 11మంది మృతి

Iran Embassy: సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి.. 11మంది మృతి 

వ్రాసిన వారు Stalin
Apr 02, 2024
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఉన్న ఇరాన్ ఎంబసీ కాన్సులర్ డివిజన్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో ఇరాన్‌కు చెందిన సీనియర్‌ సైనిక సలహాదారుతో పాటు ఇతర సిబ్బంది మరణించారు. ఈ విషయాన్ని సిరియా ప్రభుత్వ మీడియా సోమవారం వెల్లడించింది. ఈ దాడిలో ఇరాన్ సైనిక సలహాదారు జనరల్ అలీ రెజా జహాదీ మరణించినట్లు ఇరాన్ అరబిక్ భాషా స్టేట్ టెలివిజన్ అల్-ఆలం, అరబిక్ రీజియన్ టెలివిజన్ స్టేషన్ అల్-మదీన్ తెలిపాయి. జహాదీ గతంలో 2016 వరకు లెబనాన్, సిరియాలో ఇరాన్ ఎలైట్ కుడ్స్ ఫోర్స్‌కు నాయకత్వం వహించారు.అయితే, ప్రస్తుతం దాడి జరిగిన ప్రదేశంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

ఇరాన్ 

ఇప్పటి వరకు 11మంది మృతి 

ఈ ఘటనను ఇరాన్ రాయబారి హుస్సేన్ అక్బరీ ఖండించారు.ఈ దాడిలో కనీసం 11 మంది మరణించారని చెప్పారు. శిథిలాల కింద ప్రజలు చిక్కుకుపోయారని రెస్క్యూ సిబ్బంది ఇప్పటికీ భయపడుతున్నారని ఆయన అన్నారు. భవనానికి కాపలాగా ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారని రాయబారి తెలిపారు. సిరియా విదేశాంగ మంత్రి ఫైసల్ మెక్దాద్, ఇరాన్ రాయబారి అక్బరీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇజ్రాయెల్‌ ప్రతి దాడి ఎదుర్కోక తప్పదన్నారు.. ఇంతే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనను ప్రపంచమంతా ఖండించాలని ఇరాన్‌ విదేశాంగ అధికార ప్రతినిధి కోరారు.

ఇరాన్ 

మజేహ్‌లో భవనం నేలమట్టం 

ఇరాన్ రాయబారి నివాసం రాయబార కార్యాలయం పక్కనే ఉన్న కాన్సులర్ భవనంలో ఉందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తన వార్తలలో పేర్కొంది. ప్రభుత్వ వార్తా సంస్థ సనా, మిలిటరీ మూలాన్ని ఉటంకిస్తూ, మజేహ్‌లోని భారీ కాపలా ప్రాంతంలోని భవనం నేలమట్టం అయ్యిందని తెలిపింది. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాల కోసం సహాయక సిబ్బంది వెతుకుతున్నారు. ఈ దాడి ఘటనపై ఇజ్రాయెల్‌ ఇప్పటి వరకు స్పందించలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి