LOADING...
సిరియాలో ఐఎస్ఐఎస్ నాయకుడు హతం; టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటన 
సిరియాలో ఐఎస్ఐఎస్ నాయకుడు హతం; టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటన

సిరియాలో ఐఎస్ఐఎస్ నాయకుడు హతం; టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటన 

వ్రాసిన వారు Stalin
May 01, 2023
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

సిరియాలో డేష్/ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ కీలక నాయకుడు అబూ హుస్సేన్ అల్-ఖురాషీని హతమార్చినట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు. ఇస్లామిక్ స్టేట్ సంస్థ టర్కీలో 'డేష్' అనే కోడ్ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 'డేష్' నాయకుడు అబూ హుస్సేన్ అల్-ఖురేషీని చాలా కాలంగా జాతీయ గూఢచార సంస్థ నిఘా పెట్టిందని ఎర్డోగాన్ తెలిపారు. తీవ్రవాద సంస్థల విషయంలో టర్కీకి రెండో ఆలోచన ఉండదని చెప్పారు. తీవ్రవాదులపై టర్కీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సిరియా

2013లో ఐసిస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన టర్కీ

2013లో డేష్/ఐసిస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన దేశాల్లో టర్కీ ఒకటి. అప్పటి నుంచి టర్కీ అనేకసార్లు తీవ్రవాద దాడును ఎదుర్కొంది. కనీసం 10 ఆత్మాహుతి బాంబు దాడులు, ఏడు బాంబు దాడులు,నాలుగు సాయుధ దాడుల్లో మొత్తం 300 మందికి పైగా మరణించారు. వందల మంది గాయపడ్డారు. తదుపరి దాడులను నివారించడానికి టర్కీయే స్వదేశంలో, విదేశాల్లో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ప్రారంభించింది.