Iran: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన ఆరోపణ
సిరియా పతనం నుంచి పూర్తి ప్రయోజనం పొందేందుకు ఇజ్రాయెల్ తన చర్యలను ముమ్మరం చేసింది. డమాస్కస్‌ను హయాత్ తహరీర్ అల్-షామ్ రెబల్స్ ఆక్రమించగానే, టెల్ అవీవ్ వ్యూహాన్ని మార్చి, "ఆపరేషన్ ఏరో ఆఫ్ బషన్"ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా సిరియాలోని వైమానిక స్థావరాలు, నౌకాదళ కేంద్రాలు లక్ష్యంగా వందల సంఖ్యలో వైమానిక దాడులు జరిగాయి. బషన్ అనే పదం ఇజ్రాయెల్ ఆధ్యాత్మిక గ్రంథాలలో సిరియాలోని ఉత్తర ప్రాంతాలను సూచిస్తుంది. డిసెంబర్ 7న, రెబల్స్ కదలికలను గమనిస్తూ, ఇజ్రాయెల్ బషర్ ప్రభుత్వ పతనాన్ని గుర్తించి, సిరియాలో వ్యూహాత్మక స్థావరాలపై దాడులకు ప్రణాళిక సిద్ధం చేసింది.
సిరియాను సైనికంగా బలహీనంగా మార్చడం ప్రధాన లక్ష్యం
డిసెంబర్ 10న 350 యుద్ధ విమానాలతో 320 లక్ష్యాలను ధ్వంసం చేస్తూ, సిరియా వాయుసేన, నేవీ సామర్థ్యాలను 80 శాతం తగ్గించింది. పలు పోర్టులు, నౌకలు, రాడార్లు, క్షిపణులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్ సుదీర్ఘ కాలంగా సేకరించిన ఇంటెలిజెన్స్ ఉపయోగించింది. సిరియాను సైనికంగా బలహీనంగా మార్చడం ప్రధాన లక్ష్యంగా ఈ దాడులు కొనసాగాయి. ఇదే సమయంలో, ఇరాన్ అమెరికా-ఇజ్రాయెల్ కుట్రగా ఈ చర్యలను విమర్శిస్తూ, తమ భవిష్యత్తులో మరింత బలమైన ప్రతిఘటనా శక్తి ఏర్పడుతుందని పేర్కొంది. గతంలో కూడా ఇజ్రాయెల్ సిరియాపై పలు ముఖ్యమైన దాడులు చేసిన విషయం గమనార్హం.