భూకంపం: 11రోజులుగా శిథిలాల కింద సజీవంగా ముగ్గురు; టర్కీ, సిరియాలో 45,000 దాటిన మరణాలు
టర్కీ, సిరియాలో 11రోజలు కింద సంభవించిన భారీ భుకంపాల ధాటికి ఇప్పటి వరకు 45,000 మందికి పైగా మరణించారు. 40కిపైగా వచ్చిన ప్రకంపనల వల్ల వేలాది భవనాలను నేలమట్టం అయ్యాయి. దాదాపు 2,64,000 అపార్ట్‌మెంట్లు పోయాయి. గడ్డకట్టే చలిలోనూ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నా కొద్ది.. మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇన్ని రోజుల తర్వత కూడా టర్కీలో శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. దాదాపు 278 గంటల పాటు వారు శిథిలాల కిందే ఉండటం గమనార్హం. రక్షించిన ముగ్గురిని హకన్ యాసినోగ్లు (40), ఉస్మాన్ హలేబియే (14), ముస్తఫా అవ్సీ (34)గా అధికారులు పేర్కొన్నారు.
నాసిరకం భవన నిర్మాణాలపై టర్కీ ప్రభుత్వం సీరియస్
వరుస భూకంపాల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న టర్కీ, సిరియాకు సాయం చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. టర్కీకి సహాయం 1 బిలియన్ డాలర్లు, సిరియాకు 400 మిలియన్ల డాలర్లు సాయం చేయాలని కోరింది. అలాగే నాసిరకం భవన నిర్మాణాలపై టర్కీలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. బిల్డింగ్ డెవలపర్‌లతో సహా 100 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని టర్కీ ప్రభుత్వం ఆదేశించింది. నాణ్యత లేకుండా భవనాలను నిర్మించడం వల్లే విధ్వంసం ఎక్కువగా జరిగిందని ప్రభుత్వం నమ్ముతోంది.