సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
ఫిలిప్పీన్స్‌లో గురువారం భూకంపం సంభవించింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో మాస్బేట్ ప్రాంతంలో భారీ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) పేర్కొంది.
భారీ భుకంపం నేపథ్యంలో ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని, అలాగే ప్రాణనష్టం జరగలేదని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ నివేదించింది.
భూకంపం
బలమైన కుదుపులతో ఒక్కసారి ఉలిక్కిపడి నిద్రలేచిన ప్రజలు
మస్బేట్‌లోని ఉసన్ మునిసిపాలిటీలోని మియాగా గ్రామం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:00 గంటల తర్వాత భూకంపం సంభివించింది. బలమైన కుదుపులు రావడంతో ప్రజలకు ఒక్కసారి ఉలిక్కిపడి నిద్రలేచారు.
భూకంపం కారణంగా మస్బేట్‌లో విద్యా సంస్థలను మూసివేశారు. భయంతో చాలా మంది తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు ఉసన్ పోలీసు చీఫ్ కెప్టెన్ రెడెన్ టోలెడో వెల్లడించారు.
బలమైన కదలికలు వచ్చినా, భవనాలు, ఇతర నిర్మాణాలు దెబ్బతిన్నట్లు కనిపించడం లేదని అధికారులు తెలిపారు.