న్యూజిలాండ్ తీరంలో భారీ భూకంపం; రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదు
సైక్లోన్ సృష్టించిన విధ్వంసం నుంచి తేరుకోకముందే న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ధృవీకరించింది. ఈ భూకంపం వెల్లింగ్‌టన్ సమీపంలోని లోయర్ హట్‌కు వాయువ్యంగా 78 కి.మీ దూరంలో సంభవంచినట్లు వెల్లడించింది. భూకంప కేంద్రం పరపరము పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృమైనట్లు జియోనెట్ చెప్పింది. వెల్లింగ్టన్‌లో కొన్ని సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు సంభవించాయని ప్రత్యేక్ష సాక్షి చెప్పినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.
సైక్లోన్ ధాటికి నలుగురు మృతి
కొన్నిరోజులుగా గాబ్రియెల్ తుఫాను న్యూజిలాండ్‌ను వణికిస్తోంది. తుఫాను కారణంగా గణనీయమైన నష్టాన్ని కలిగించింది. సైక్లోన్ ధాటికి ఎమర్జెన్సీ విధించారు. ఇప్పటివరకు తుఫాను కారణంగా నలుగురు మృతి చెందారు. 10,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రాకపోకలు స్తంభించిపోయాయి. బుధవారం సైక్లోన్ తీరం దాటడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది.