Page Loader
న్యూజిలాండ్ కొత్త ప్రధాని: జెసిండా ఆర్డెర్న్ స్థానంలో 'క్రిస్ హిప్‌కిన్స్' ఎన్నిక
జెసిండా ఆర్డెర్న్ స్థానంలో 'క్రిస్ హిప్‌కిన్స్' ఎన్నిక

న్యూజిలాండ్ కొత్త ప్రధాని: జెసిండా ఆర్డెర్న్ స్థానంలో 'క్రిస్ హిప్‌కిన్స్' ఎన్నిక

వ్రాసిన వారు Stalin
Jan 21, 2023
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా ప్రస్తుతం ఆ దేశ విద్యాశాఖ మంత్రిగా ఉన్న క్రిస్ హిప్‌కిన్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. పోటీలో హిప్‌కిన్స్ ఒక్కరే ఉండటం వల్ల ఆయన ఎంపిక దాదాపు ఖరారైనట్లే. అధికార లేబర్ పార్టీ సమావేశంలో హిప్‌కిన్స్‌ను అధికారంగా ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 7న తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రస్తుత ప్రధాని జెసిండా ఆర్డెర్న్ సంచలన ప్రకటన చేశారు. దీంతో కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. అక్టోబరు 14న న్యూజిలాండ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ రాజీనామా ప్రకటన అధికార లేబర్ పార్టీని షాక్‌కు గురిచేసింది.

న్యూజిలాండ్

లేబర్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా క్రిస్ హిప్‌కిన్స్‌కు గుర్తింపు

క్రిస్ హిప్‌కిన్స్‌కు లేబర్ పార్టీలో మంచి గుర్తింపు ఉంది. పార్టీలో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించగలరనే పేరుంది. కరోనా స్వైర విహారం చేస్తున్న సమయంలో సమర్ధంగా బాధ్యతలు నిర్వర్తించారు. లేబర్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా చెప్పుకునే క్రిస్ హిప్‌కిన్స్‌.. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురాగలరని సభ్యులు నమ్ముతున్నారు. అందుకే కొత్త ప్రధానిగా అతనికి పోటీగా ఎవరూ రాలేదు. వచ్చే ఎన్నికల్లో క్రిస్ హిప్‌కిన్స్‌ నాయకత్వంలోనే లేబర్ పార్టీ పోటీ చేయనుంది. ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల క్రిస్ హిప్‌కిన్స్‌ ఆనందం వ్యక్తం చేశారు. తాను అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం జరిగే పార్టీ సమావేశంలో అధికారంగా క్రిస్ హిప్‌కిన్స్‌ ఎంపికను ప్రకటించనున్నారు.