
Iran-Israel Tensions: ప్రధాని నెతన్యాహూ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం: ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ (Iran) దాడికి ప్రతిస్పందనగా తమ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamen Nethnyahu) నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ఇజ్రాయెల్ (Israel) మిలిటరీ చీఫ్ హెర్జీ హలేవీ పేర్కొన్నారు.
దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ స్పందిస్తూ...ఇజ్రాయెల్ దాడులు చేస్తే కొన్ని క్షణాల్లోనే తిరిగి ప్రతిదాడులకు పాల్పడతామని హెచ్చరించింది.
తమ దేశంపై ఇజ్రాయెల్ దాడులు చేస్తే తామెన్నడూ ఉపయోగించని ఆయుధాలను కూడా ఆ దేశంపైకి మోహరిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్ దాడికి ప్రతిస్పందన కొన్ని క్షణాలలోపే ఉంటుందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ, రాజకీయ వ్యవహారాల మంత్రి అలీ బగేరీ ఖాన్ హెచ్చరించారు.
ఈ రెండు దేశాల ప్రకటనల నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Middile East tensions
రెండుసార్లు కేబినెట్ సమావేశం నిర్వహించిన నెతన్యాహూ
రెండువారాల క్రితం సిరియా రాజధాని డెమాస్కస్ లో టెహ్రాన్ కాన్సూలేట్ భవనంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో... దానికి ప్రతిస్పందనగా ఈనెల 13న ఇరాన్ తొలిసారి ఇజ్రాయెల్ పై దాడులకు పాల్పడింది.
300కు పైగా క్షిపణులు, డ్రోన్ క్షిపణులతో దాడి చేసి ఇజ్రాయెల్ కు ధీటుగా సమాధానమిచ్చింది.
కాగా ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ రెండుసార్లు కేబినెట్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఇంకా బయటకు వెల్లడించలేదు.
అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహూ అమెరికా అత్యున్నత అధికారి స్టీవ్ స్కాలిస్ తో భేటీ అయ్యారు.
అనంతరం తమ దేశాన్ని కాపాడుకునేందుకు చేయాల్సినదంతా చేస్తామని స్కాలిస్ తో చెప్పినట్లు నెతన్యాహూ వెల్లడించారు.