తదుపరి వార్తా కథనం

Earthquake: రాజస్థాన్‌లోని ఝున్‌ఝునులో స్వల్ప భూకంపం
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 04, 2025
03:56 pm
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ రాష్ట్రం ఝున్‌ఝునులో ఆదివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది.
ఎన్‌సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 9.30 గంటల సమయంలో భూమి కంపించింది. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో నమోదైందని అధికారులు తెలిపారు.
అయితే ఇప్పటివరకు ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగిందని సమాచారం లేదు.
Details
మధ్యప్రదేశ్ లోనూ స్వల్ప భూకంపం
ఇక శనివారం మధ్యప్రదేశ్‌లోనూ మరో స్వల్ప భూకంపం సంభవించింది.
బేతుల్ పట్టణంలో నమోదైన ఆ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.8గా ఉండిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
రెండు భూకంపాలూ స్వల్పంగా నమోదైనప్పటికీ, వరుసగా భూమి కంపిస్తుండటం ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.