
Myanmar Earthquake:మయన్మార్‌లో మరోసారి భూ ప్రకంపనలు.. 4.7 తీవ్రతతో నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
భారీ భూకంపాలతో మయన్మార్, థాయిలాండ్ అతాలకుతలమవుతున్నాయి. మృతుల సంఖ్య ఇప్పటికే 1000కి పైగా చేరినట్లు అధికారులు వెల్లడించారు.
భవనాల శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుపోయి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది.
4.7 మాగ్నిట్యూడ్ తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతకుముందు శనివారం మధ్యాహ్నం 3.8 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది.
ఉదయం నుంచీ వరుస ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి.
Details
అంతర్జాతీయ కోరిన మయన్నార్
శుక్రవారం సంభవించిన 7.7, 6.7 తీవ్రతతో వచ్చిన భూకంపాల వల్ల భారీగా నష్టం ఏర్పడింది.
భూకంపాల ధాటికి భవనాలు కూలిపోయయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. మయన్మార్ జుంటా ప్రభుత్వం అంతర్జాతీయ సాయాన్ని కోరింది. మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో విపరీతమైన నష్టం సంభవించింది.
భూకంప తీవ్రత సమీప దేశాలైన భారత్, కంబోడియా, చైనా, లావోస్‌లలోనూ గుర్తించారు. భూకంప బాధితులకు సహాయంగా భారత్ 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ను మయన్మార్‌కు పంపింది.
Details
భారత్ సాయం
టెంట్లు, బ్లాంకెట్లు, వాటర్ ప్యూరిఫైయర్లు, మెడిసిన్లు ఈ సహాయ సామగ్రిలో ఉన్నాయి. హిండన్ ఎయిర్‌బేస్ నుంచి భారత వైమానిక దళానికి చెందిన విమానం వీటిని మయన్మార్‌కు తరలించింది.
భూకంపాలకుగల ప్రధాన కారణంగా సాగైంగ్ ఫాల్ట్ లైన్ పేర్కొనబడింది. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రోప్లేట్‌ల రాపిడితో అపార శక్తి విడుదలై భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ ఫాల్ట్ లైన్ థాయ్‌లాండ్ వరకు ఉండటంతో తాజా భూకంప ప్రభావం ఆ దేశానికీ తాకింది.