
Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో ఉదయాన్నే భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత!
ఈ వార్తాకథనం ఏంటి
ఆదివారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్‌లోని దిబాంగ్ లోయలో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది.
జాతీయ భూకంప కేంద్రం ప్రకారం, ఉదయం 5:06 గంటలకు ఈ భూకంపం సంభవించిందని తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది.
ఈ భూకంపం ప్రభావంతో అక్కడి ప్రజలు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు.
అయితే ఈ ప్రకంపనల వల్ల అరుణాచల్ ప్రదేశ్‌లో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయిందని పేర్కొన్నారు.
Details
తెల్లవారు
ఇక అదే రోజు తెల్లవారుజామున ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోనూ భూకంపం సంభవించింది.
మే 18 ఆదివారం తెల్లవారుజామున 2:50 గంటలకు ఉత్తర సుమత్రాలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది.
భూకంప కేంద్రాన్ని భూమి ఉపరితలానికి 58 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఈ భూకంపం వల్ల సుమత్రాలో కూడా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించలేదు.
రెండు ప్రాంతాల్లోనూ సంభవించిన ప్రకంపనలు తక్కువ తీవ్రతతో ఉండటంతో పెద్ద ఎత్తున నష్టం జరగలేదు.