LOADING...
Japan Earthquake: కొత్త సంవత్సరాది వేళ కలవరం.. జపాన్‌ నోడా ప్రాంతంలో 6 తీవ్రతతో భూకంపం 
నోడాకు 91 కిలోమీటర్ల దూరంలో, 19.3 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం

Japan Earthquake: కొత్త సంవత్సరాది వేళ కలవరం.. జపాన్‌ నోడా ప్రాంతంలో 6 తీవ్రతతో భూకంపం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

నూతన సంవత్సరాన్ని స్వాగతించే వేళ జపాన్‌లో మరోసారి భూకంపం భయాందోళనలకు కారణమైంది. దేశ తూర్పు ప్రాంతంలోని నోడా నగరంలో రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రతతో భూమి ఒక్కసారిగా కంపించింది. నోడాకు తూర్పు దిశగా సుమారు 91 కిలోమీటర్ల దూరంలో, భూమికి 19.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగిందనే విషయాలపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

వివరాలు 

సునామీ హెచ్చరికలు జారీ 

ఇదిలా ఉండగా, డిసెంబర్ 8వ తేదీన జపాన్ తూర్పు తీరాన్ని భారీ భూకంపం కుదిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రత నమోదవడంతో పలు తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆ ఘటన మరిచిపోకముందే, డిసెంబర్ 12న మరోసారి 6.7 తీవ్రతతో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జపాన్‌లో వరుస భూకంపాలు సంభవించడంతో అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూకంపం 

Advertisement