
Mega Quake: పసిఫిక్ తీరాన్ని తాకనున్న మహావిపత్తు.. మూడు లక్షల మంది మృత్యువాత పడే ప్రమాదం?
ఈ వార్తాకథనం ఏంటి
భవిష్యత్‌లో భారీ భూకంపం (Mega Quake) సంభవించి ప్రపంచవ్యాప్తంగా వినాశనాన్ని మిగిల్చే అవకాశం ఉందని జపాన్ అంచనా వేసింది.
భూకంప తీవ్రతకు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, పలు నగరాలు సముద్రంలో మునిగిపోవచ్చని పేర్కొంది.
జపాన్ భయంకర భవిష్యవాణి
జపాన్ ప్రభుత్వం భవిష్యత్‌లో మెగా భూకంపం సంభవించే అవకాశముందని వెల్లడించింది.
ఈ భారీ భూకంపం తీవ్రత 8 లేదా అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉందని, దీని కారణంగా భారీ సునామీ సంభవించి నగరాలను సముద్రంలో కలిపివేయొచ్చని అంచనా వేసింది.
Details
ఇటీవల జరిగిన భూకంపాల నాశనం
కొద్ది రోజుల క్రితం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది.
భారీ భవనాలు, ఇళ్లు, దేవాలయాలు కూలిపోయాయి. థాయిలాండ్, బ్యాంకాక్ వంటి ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు ప్రకటించాల్సి వచ్చింది.
ఇలాంటి ఘటనల మధ్య జపాన్ అంచనాలు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
జపాన్ తీరాన్ని తాకనున్న మహా విపత్తు?
జపాన్ ప్రభుత్వ ప్రకారం పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించవచ్చు.
దీని ఫలితంగా వినాశకరమైన సునామీ వస్తుందని, లక్షలాది మంది ప్రజలు కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తోంది.
మృతదేహాలను లెక్కించడం కూడా కష్టమయ్యేంత విధ్వంసం జరుగుతుందని పేర్కొంది.
Details
భారీ ఆర్థిక నష్టం, నిరాశ్రయులుగా మారనున్న లక్షలాది మంది
జపాన్ భూకంప ప్రమాద జోన్‌లో ఉన్న దేశం.
భూకంపం సంభవించే అవకాశం 80శాతమని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఒకవేళ 9 తీవ్రతతో భూకంపం వస్తే, 13 లక్షల మంది నిరాశ్రయులుగా మారే ప్రమాదం ఉంది.
3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.
జపాన్ ఆర్థిక వ్యవస్థ 2 ట్రిలియన్ డాలర్లు (రూ. 171 లక్షల కోట్లు) నష్టపోవచ్చని అంచనా.
జపాన్ ముందస్తు ప్రణాళిక
ఈ భయంకర భూకంపాన్ని ఎదుర్కొనేందుకు జపాన్ ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. రక్షణ చర్యలను బలోపేతం చేయడంతో పాటు పౌరులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.
ఈ అంచనాలు నిజమైతే జపాన్‌తో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది.