LOADING...
Iran Earthquake: దాడుల మధ్య ఇరాన్‌లో ప్రకంపనలు.. ప్రజల్లో భయాందోళన

Iran Earthquake: దాడుల మధ్య ఇరాన్‌లో ప్రకంపనలు.. ప్రజల్లో భయాందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకవైపు అమెరికా,ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్న వేళ... మరోవైపు ఇరాన్ లో భూకంపం కలకలం రేపింది. దక్షిణ ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...గెరాష్‌కు ఉత్తర వాయువ్య దిశలో సుమారు 55కిలోమీటర్ల దూరంలో,భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రకంపనలు తేలికపాటి నుంచి మధ్యస్థాయికి చెందినవిగా నిపుణులు చెబుతున్నారు. భూకంపం సంభవించిన ప్రాంతం ఎక్కువగా గ్రామీణ ప్రాంతమే కావడంతో... ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ఆస్తి,ప్రాణ నష్టంపై స్పష్టమైన సమాచారం అందలేదు. ఇదిలా ఉంటే..ఈఘటనకు సంబంధించి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదని అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇరాన్‌లో భూకంపం.. 4.3 తీవ్రత 

Advertisement