LOADING...
Tsunami: రష్యా, జపాన్‌లో సునామీ.. భారతీయులకు అలర్ట్‌ చేసిన అమెరికాలోని భారత కాన్సులేట్‌ జనరల్‌
భారతీయులకు అలర్ట్‌ చేసిన అమెరికాలోని భారత కాన్సులేట్‌ జనరల్‌

Tsunami: రష్యా, జపాన్‌లో సునామీ.. భారతీయులకు అలర్ట్‌ చేసిన అమెరికాలోని భారత కాన్సులేట్‌ జనరల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలో బుధవారం ఉదయం తీవ్రమైన భూకంపం సంభవించింది. దీని ప్రభావం రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని అనేక తీర ప్రాంతాల్లో కనిపించింది. ఈ భూకంపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో సునామీ అలలు వచ్చాయి. దీనిపై స్పందించిన అమెరికాలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

వివరాలు 

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌  

''సునామీ పరిస్థితిని మేము సమీక్షిస్తున్నాం. కాలిఫోర్నియా, హవాయి వంటి పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయులు చాలా అప్రమత్తంగా ఉండాలి. అమెరికా అధికారులు ఇచ్చే హెచ్చరికలను గమనిస్తూ వెంటనే పాటించాలి. ఎవరైనా తీర ప్రాంతాల్లో ఉంటే వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళాలి. అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండండి. మీ మొబైల్‌, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్‌ ఉంచండి. ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే అత్యవసర నంబర్లకు సంప్రదించండి,'' అని కాన్సులేట్‌ జనరల్‌ 'ఎక్స్‌' ఖాతాలో వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ చేసిన ట్వీట్ 

వివరాలు 

అమెరికా అధ్యక్షుడు స్పందించిన ట్రంప్‌ 

ఇక ఈపరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా స్పందించారు. ''పసిఫిక్ మహా సముద్రంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా హవాయి రాష్ట్రానికి సునామీ హెచ్చరిక జారీ అయింది.పసిఫిక్ తీర ప్రాంతాలన్నింటికీ ముప్పు ఉంది.ప్రజలంతా భయపడకండి. త్వరగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి.అధికారుల సూచనలను అనుసరించండి,''అని ఆయన ప్రజలకు సూచించారు. భూకంపం కేంద్ర బిందువుగా పెట్రోపావ్లోవ్స్క్‌-కామ్చాట్‌స్కీ ఈభారీ భూకంపం రష్యా తూర్పు తీర ప్రాంతమైన పెట్రోపావ్లోవ్స్క్‌-కామ్చాట్‌స్కీ వద్ద ఉదయం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.7గా నమోదైంది.ఈప్రకంపనల ప్రభావంతో కురిల్‌ దీవులు(రష్యా), హొక్కైడో దీవులు(జపాన్)ప్రాంతాల్లో సునామీ అలలు వచ్చాయి. భారీ అలలు తీరాన్ని తాకాయి. భూకంపం సమయంలో అనేక భవనాలు కంపించాయి,దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

వివరాలు 

తీర ప్రాంతాల్లో వరద 

సునామీ ప్రభావంతో ఇప్పటికే కొన్ని తీర ప్రాంతాల్లో వరదలు పోటెత్తినట్టు సమాచారం. ఆయా ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. మరికొన్ని ప్రాంతాలకు కూడా సునామీ ముప్పు ఉందని హెచ్చరికలు విడుదలయ్యాయి. వీటిలో హవాయి, చిలీ, సోలెమన్‌ దీవులు, అలస్కా, ఒరెగాన్‌, వాషింగ్టన్‌ రాష్ట్రాల్లోని కొన్ని తీరప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని స్థానిక అధికార యంత్రాంగాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి.