
Earthquake: అఫ్గానిస్తాన్‌ను వణికించిన భారీ భూకంపం.. 250 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
సోమవారం తెల్లవారుజామున దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. భూకంపం ప్రభావంతో 250 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 500 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌తో పాటు ఉత్తర భారతదేశంలోనూ ఈ భూకంపం ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో నేల కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Details
హిమాలయాల్లో పెరుగుతున్న భూకంపాలు
ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు దాని పొరుగు హిమాలయన్ బెల్టులో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కారణం భారతీయ (ఇండియన్) యూరాసియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడమేనని సైంటిస్టులు వెల్లడించారు. హిమాలయ వ్యాలీలలో ఎక్కువ జనాభా ఉండటం, భూకంప నిరోధక ప్రమాణాలను పాటించకుండా భవనాలు నిర్మించడం, అలాగే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రమాద సమయంలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు హెచ్చరించారు.