LOADING...
Earthquake: ఇండోనేషియా సుమత్రా ద్వీపంలో 6.3 తీవ్రతతో భూకంపం
ఇండోనేషియా సుమత్రా ద్వీపంలో 6.3 తీవ్రతతో భూకంపం

Earthquake: ఇండోనేషియా సుమత్రా ద్వీపంలో 6.3 తీవ్రతతో భూకంపం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2025
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేషియాలో భారీగా భూకంపం హడలెత్తించింది.సుమత్రా ద్వీపాన్ని కేంద్రంగా చేసుకుని 6.3 తీవ్రతతో భూకంపంనమోదైంది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని.. సునామీ వచ్చే అవకాశం లేదని జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది..స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, మరోవైపు సెన్యార్ తుఫాన్ ప్రభావంతో అకస్మాత్తుగా వరదలు ఉద్ధృతంగా వచ్చి సమస్యలు తీవ్రతరం చేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడడం వల్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ వరదల కారణంగా ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లోని ఉత్తర తపనులి ప్రాంతంలో ఒక వంతెన పూర్తిగా కూలిపోయింది. ఈ విపత్తుల్లో ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అనేక రహదారులు దెబ్బతిన్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా తీవ్రంగా ప్రభావితమైంది. ప్రస్తుతం రక్షణ, సహాయక కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండోనేషియాను వణికించిన భారీ భూకంపం 

Advertisement