
Earthquake: క్వీన్స్‌ల్యాండ్‌లో 5.4 తీవ్రతతో భూకంపం.. అధికారులు అప్రమత్తం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.4గా నమోదైన ఈ భూకంపం స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించింది. యూరోపియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం ఈ భూకంపం భూమి ఉపరితలానికి 10 కిలోమీటర్ల (6.2 మైళ్ల) లోతులో చోటుచేసుకుంది. దీంతో సమీప పట్టణాలు, నగరాల్లో భూకంప ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అధికారులు తక్షణమే అప్రమత్తమై అవసరమైన చర్యలు చేపట్టారు.
Details
జనాభా ఎక్కువగా ఉన్న తీరప్రాంతంలో ప్రభావం
శనివారం ఉదయం క్వీన్స్‌ల్యాండ్ తూర్పు తీరప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు ధ్రువీకరించారు. కొన్నిచోట్ల భవనాలు కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం వస్తోంది. ముఖ్యంగా జనాభా ఎక్కువగా ఉన్న తీరప్రాంతంలో ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక క్వీన్స్‌ల్యాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గతంలోనే ఈ ప్రాంతాన్ని అధిక ప్రమాదకర భూకంప మండలంగా గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రమాదాన్ని జియోసైన్స్ ఆస్ట్రేలియా నేషనల్ భూకంప హెచ్చరిక కేంద్రం విశ్లేషిస్తోంది.