LOADING...
Earthquake: లడఖ్‌లోని లేహ్ సమీపంలో 5.7 తీవ్రతతో భూకంపం
లడఖ్‌లోని లేహ్ సమీపంలో 5.7 తీవ్రతతో భూకంపం

Earthquake: లడఖ్‌లోని లేహ్ సమీపంలో 5.7 తీవ్రతతో భూకంపం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 19, 2026
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూకంపంతో జమ్ముకశ్మీర్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సోమవారం ఉదయాన్నే లఢాఖ్‌లోని లేహ్ ప్రాంతం,కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కశ్మీర్‌ ప్రజలను వణికించాయి. ఇళ్లలో, కార్యాలయాల్లో ఉన్న వారు భద్రత కోసం బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా, ప్రాణ నష్టం లేదా ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు అని అధికారులు వెల్లడించారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించిన సమాచారం ప్రకారం, భూకంపం ఉదయం 11:51 గంటలకు చోటుచేసుకుంది.

వివరాలు 

ఇది ఒక సాధారణ ఘటనే..

లేహ్ ప్రాంతం దగ్గర భూకంప కేంద్రం నమోదై ఉండగా, భూకంపం 171 కిలోమీటర్ల లోతులో సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.7 తీవ్రత నమోదైంది. ఈ ప్రకంపనలు జమ్ము కశ్మీర్‌ రీజియన్‌ అంతటా ప్రభావం చూపాయి. అప్రమత్తమైన అధికారులు ప్రజలను జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భూకంపాలకు అధికంగా ప్రతిస్పందించే హిమాలయ ప్రాంతంలో ఇది ఒక సాధారణ ఘటనే. గత ఆదివారం, అఫ్ఘనిస్తాన్‌లో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించగా, ఈరోజు జరగిన ప్రకంపనలు తాత్కాలికమని నిపుణులు పేర్కొన్నారు. అయితే, ఆఫ్టర్‌షాక్స్‌ వచ్చే అవకాశాన్ని పూర్తిగా త్యజించరానని వారు హెచ్చరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జమ్ము కశ్మీర్‌లో భూకంపం

Advertisement