Japan Earthquake: జపాన్‌లో 6.7 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆదివారం ఉత్తర జపాన్ తీరంలో సంభవించిన భారీ భూకంపం తర్వాత జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికను జారీ చేసింది. ఈ భూకంపం ఇవాటే ప్రిఫెక్చర్ తీరానికి సమీపంలో, సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతులో 6.7 తీవ్రతతో సంభవించింది అని వాతావరణ సంస్థ తెలిపింది. జపాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ NHKవెల్లడించినట్లు, ఉత్తర తీర ప్రాంతానికి 1 మీటర్ ఎత్తుతో సునామీ అలలు రావచ్చని హెచ్చరిక జారీ చేశారు. నివాసితులను తీర ప్రాంతాలకు దూరంగా ఉండమని ప్రభుత్వం సూచించింది. NHK ప్రకారం, ఇవాటే ప్రిఫెక్చర్ తీరానికి సుమారు 70 కిలోమీటర్ల (45 మైళ్ళ) దూరంలో సాయంత్రం 5:12గంటలకు (0812 GMT) సునామీ సంభవించిందని, త్వరలోనే అది పసిఫిక్ తీరానికి చేరుకుంటుందని వెల్లడించింది.
Details
ఆలస్యంగా నడిచిన బుల్లెట్ రైళ్లు
దాదాపు 1 మీటర్ (3 అడుగులు, 3 అంగుళాలు) ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. అంతకుముందు, అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ ప్రకారం, జపాన్‌లోని అతిపెద్ద ద్వీపం హోన్షు తూర్పు తీరంలో 6.26 తీవ్రతతో భూకంపం సంభవించి, ఇవాటే ప్రిఫెక్చర్ కూడా ప్రభావితమైంది. రైల్వే ఆపరేటర్ JR ఈస్ట్ తెలిపినట్లుగా, భూకంపాల కారణంగా బుల్లెట్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. అలాగే, క్యోటో న్యూస్ ప్రకారం, విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఈ ప్రాంతం 2011 మార్చిలో జరిగిన ఘోర భూకంపం, సునామీ కారణంగా ఇప్పటికే వణికిన విషయం తెలిసిందే.