
Earthquake: మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం.. ఢాకా, చిట్టగాంగ్ సహా బంగ్లాదేశ్‌లో ప్రకంపనలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశ పొరుగు దేశమైన మయన్మార్‌ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం బంగ్లాదేశ్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యంగా ఢాకా, చిట్టగాంగ్ వంటి నగరాల్లో స్పష్టంగా భూమి కంపించిందని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బంగ్లాదేశ్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ భూకంపానికి కేంద్రం మయన్మార్‌లోని మండలే, బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోనే ఉందని వివరించారు.
Details
597 కిలోమీటర్ల దూరంలో గుర్తింపు
భూకంప కేంద్రం ఢాకా నుండి సుమారు 597 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. బంగ్లాదేశ్ వాతావరణ శాఖ భూకంప పరిశీలన, పరిశోధన కేంద్రం తాత్కాలిక అధికారి మొహమ్మద్ రుబయత్ కబీర్ మాట్లాడుతూ, ఈ భూకంపాన్ని ఒక ప్రధాన భూకంప సంఘటనగా పరిగణించవచ్చని తెలిపారు. యూఎస్‌జీఎస్ (USGS) ప్రకారం ఈ భూకంప కేంద్రం మయన్మార్‌లోని సాగింగ్ ప్రాంతానికి వాయువ్యంగా 16 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది. దీని ప్రభావం బంగ్లాదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో కనిపించిందని సమాచారం.