LOADING...
Earthquake: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం 
అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం

Earthquake: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో సోమవారం అర్ధరాత్రి సమయంలో తీవ్ర భూకంపం సంభవించింది. అర్ధరాత్రి 12 గంటల 11 నిమిషాలకు భూమి 6.5 తీవ్రతతో కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మొలజీ (NCS) పేర్కొంది. ఈ భూకంపం భూమి ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉందని అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం నికోబార్‌ దీవుల్లోనే ఉన్నట్లు తెలిపింది. అయితే, ఈ భూకంపానికి సంబంధించి సునామీ వచ్చే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేశారు. భూకంపం వల్ల కలిగిన నష్టానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.

వివరాలు 

బంగాళాఖాతంలో మరో భూకంపం - 6.3 తీవ్రతతో ప్రకంపనలు 

ఇక మరోవైపు బంగాళాఖాతంలోనూ భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత 6.3గా నమోదైందని ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. దీని ప్రభావంతో సముద్ర తీరానికి సమీపంలోని దీవుల్లోనూ ప్రకంపనలు కనిపించినట్లు తెలిపింది. అదే సమయంలో ఇండోనేషియా ప్రాంతంలోనూ భూకంపం సంభవించినట్లు సమాచారం. మొత్తం మీద ఆగ్నేయాసియాలో అనేక ప్రాంతాల్లో భూకంపాల ప్రభావం కనిపించడంపై అధికారులు అప్రమత్తమయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేషనల్ సెంటర్ ఫర్ సేసిమొలజీ చేసిన ట్వీట్