Page Loader
Earthquake: రష్యాలో ప్రకంపనలు.. 7.4 తీవ్రతతో భారీ భూకంపం
రష్యాలో ప్రకంపనలు.. 7.4 తీవ్రతతో భారీ భూకంపం

Earthquake: రష్యాలో ప్రకంపనలు.. 7.4 తీవ్రతతో భారీ భూకంపం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2025
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కేంద్రం పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్కా నగరానికి తూర్పుగా సుమారు 144 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్‌ మహాసముద్రంలో ఉందని గుర్తించారు. ఈ ప్రకంపనల అనంతరం రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు హవాయి తీర ప్రాంతాలకు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం లేదు.

Details

సురక్షిత  ప్రాంతాలకు వెళ్లాలని సూచన

అయితే ముందుజాగ్రత్త చర్యలగా స్థానిక అధికారులు ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు జారీ చేశారు. ఈ భారీ భూకంపం సంభవించకముందే దాదాపు గంట వ్యవధిలో అదే ప్రాంతంలో ఐదు చిన్నపాటి భూకంపాలు నమోదైనట్లు అమెరికన్ జియోలాజికల్ సర్వే (USGS) పేర్కొంది. వీటిలో 7.4 తీవ్రతతో కూడిన భూకంపమే ప్రధానంగా పరిగణించనుంది.