LOADING...
Earthquake: గ్రీస్‌లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
గ్రీస్‌లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Earthquake: గ్రీస్‌లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆగ్నేయ ఐరోపాలోని గ్రీస్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైందని జర్మనీకి చెందిన జియోసైన్సెస్‌కు సంబంధించిన పరిశోధనా కేంద్రం (German Research Centre for Geosciences) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి 77 కిలోమీటర్ల లోతులో ఏర్పడిందని ఆ కేంద్రం పేర్కొంది. ఈ భూకంపానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం గురించి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని వెల్లడించారు. అయితే భూ ప్రకంపనల కారణంగా అధికారులు అప్రమత్తమవుతూ, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

వివరాలు 

గ్రీస్‌లో సంభవించిన రెండవ భారీ భూకంపం

ఈ ప్రకంపనల ప్రభావం గ్రీస్‌కు మిత్రదేశాలైన కైరో, ఇజ్రాయెల్, ఈజిప్టు, లెబనాన్‌, తుర్కియే, జోర్డాన్‌ దేశాల్లో కూడా నమోదైంది. అక్కడ కూడా స్వల్ప ప్రకంపనలు సంభవించాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, గత పది రోజుల వ్యవధిలో ఇది గ్రీస్‌లో సంభవించిన రెండవ భారీ భూకంపం కావడం గమనార్హం. ఇదే నెల 14వ తేదీన కూడా గ్రీస్‌లోని కాసోస్ అనే ద్వీపప్రాంతంలో భూకంపం సంభవించింది. ఆ సమయంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదు కాగా, భూకంప కేంద్రం భూమి లోతులో 78 కిలోమీటర్ల లో ఉందని అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) పేర్కొంది. ఆ భూకంప కేంద్రం, ఫ్రై పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించారు.