
largest earthquakes: ప్రపంచాన్ని హడలెత్తించిన 10 భారీ భూకంపాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా తీర ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల ప్రభావంతో రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ సంభవించింది. 2011 తర్వాత పసిఫిక్ ప్రాంతంలో నమోదైన అత్యంత తీవ్రత గల భూకంపంగా నిపుణులు దీనిని అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని గతంలో వణికించిన అత్యంత భయంకరమైన 10 భూకంపాలను పరిశీలిస్తే:
వివరాలు
1. 1960 - చిలీ: ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం
చిలీలో 1960లో బయోబియో ప్రాంతంలో 9.5 తీవ్రతతో సంభవించిన వాల్డివియా భూకంపం లేదా గ్రేట్ చిలీ భూకంపం, ఇప్పటి వరకు నమోదైన అత్యంత భారీ భూకంపంగా నిలిచింది. ఈ ఘటనలో సుమారు 1,655 మంది మృతి చెందగా, 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2. 1964 - అలస్కా: గ్రేట్ అలస్కా భూకంపం అమెరికాలోని అలస్కాలో 1964లో 9.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రిన్స్ విలియం సౌండ్ ప్రాంతంలో సంభవించిన ఈ ప్రకంపనలను 'గుడ్ ఫ్రైడే భూకంపం'గా కూడా పిలుస్తారు. భూకంపంతో పాటు వచ్చిన సునామీ కారణంగా 130 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తినష్టం సుమారు 2.3 బిలియన్ డాలర్ల మేరకు జరిగింది.
వివరాలు
3. 2004 - ఇండోనేషియా: సుమత్రా-అండమాన్ భూకంపం
ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 2004లో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం, భారీ సునామీకి కారణమైంది. దాదాపు 2,80,000 మందికి పైగా ప్రజలు మరణించగా, దక్షిణాసియా మరియు తూర్పు ఆఫ్రికా ప్రాంతాల్లో సుమారు 1.1 మిలియన్ మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 4. 2011 - జపాన్: గ్రేట్ తోహోకు భూకంపం 2011లో జపాన్‌లోని తోహోకు ప్రాంతంలో సంభవించిన 9.1 తీవ్రత గల ఈ భూకంపాన్ని 'గ్రేట్ తోహోకు భూకంపం'గా పిలుస్తారు. భూకంపానికి అనంతరం వచ్చిన సునామీ కారణంగా 15,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1,30,000 మందికి పైగా వారి నివాసాలను కోల్పోయారు.
వివరాలు
5. 1952 - రష్యా: కమ్చట్కా భూకంపం
1952లో రష్యాలోని కమ్చట్కా ప్రదేశ్‌లో 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. హవాయి దీవుల వరకు ప్రకంపనలు చేరి భారీ సునామీని తలపోసాయి. సుమారు 1 మిలియన్ డాలర్ల ఆస్తినష్టం జరిగింది. 6. 2010 - చిలీ: మరోసారి భారీ ప్రకంపనలు 2010లో చిలీలోని బయోబియో ప్రాంతంలో 8.8 తీవ్రతతో మరోసారి భూప్రకంపనలు నమోదయ్యాయి. క్విరిహ్యూ నగరానికి సమీపంలో సంభవించిన ఈ భూకంపంలో 523 మంది మృతి చెందారు. దాదాపు 3.7 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి.
వివరాలు
7. 1906 - ఈక్వెడార్-కొలంబియా భూకంపం
ఈక్వెడార్, కొలంబియా మధ్య 1906లో సంభవించిన 8.8 తీవ్రత గల భూకంపం భారీ సునామీకి దారితీసింది. ఈ విపత్తులో 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. 8. 1965 - అలస్కా: ర్యాట్ దీవుల భూకంపం అలస్కాలోని ర్యాట్ దీవుల సమీపంలో 1965లో 8.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కారణంగా 35 అడుగుల ఎత్తుతో అలలు విరుచుకుపడ్డాయి. 9. 1950 - భారత్: అస్సాం-టిబెట్ భూకంపం 1950లో భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో 8.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనిని 'అస్సాం-టిబెట్ భూకంపం'గా పిలుస్తారు. ఈ ఘటనలో 780 మంది మరణించారు.
వివరాలు
10. 2012 - ఇండోనేషియా: ఉత్తర సుమత్రా ప్రకంపనలు
2012లో ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా తీరంలో 8.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇది ఆ ప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ భూకంపాలు ప్రపంచాన్ని వణికించిన ఉదంతాలుగా నిలిచాయి. ప్రకృతి అప్రతిహత శక్తిని తెలియజేస్తూ, మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుచేస్తున్నాయి.