LOADING...
Earthquake: రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. 7.1 తీవ్రతతో ప్రకంపనలు
రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. 7.1 తీవ్రతతో ప్రకంపనలు

Earthquake: రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. 7.1 తీవ్రతతో ప్రకంపనలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2025
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలో మరోసారి భూకంపం సంభవించింది. కామ్చాట్కా తూర్పు తీరప్రాంతంలో శనివారం భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.1గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకటించింది. భూకంప కేంద్రం భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు పేర్కొంది. దీనితో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరించారు. ఇక ఇటీవలే ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో స్వల్పంగా సునామీ కూడా ఏర్పడింది. తాజా భూకంపం నేపథ్యంలో స్థానిక ప్రజలు ఆందోళన, భయభ్రాంతులకు గురవుతున్నారు.