LOADING...
Turkey Earthquake: పశ్చిమ టర్కీలో 6.1 తీవ్రతతో భూకంపం.. ఒకరు మృతి 
పశ్చిమ టర్కీలో 6.1 తీవ్రతతో భూకంపం.. ఒకరు మృతి

Turkey Earthquake: పశ్చిమ టర్కీలో 6.1 తీవ్రతతో భూకంపం.. ఒకరు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

టర్కీ దేశంలోని బలికెసిర్‌ ప్రావిన్స్‌లో ఆదివారం సాయంత్రం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనివల్ల 200 కి.మీ. దూరంలోని ఇస్తాంబుల్‌లోనూ భూమి కంపించింది. సిందిర్గి పట్టణంలో ఈ భూకంపం కారణంగా దాదాపు 16 భవనాలు కూలిపోయినట్లు స్థానిక మీడియా సమాచారం అందించింది. శిథిలాల కింద చిక్కుకున్న ఓ యువతి ప్రాణాలు కోల్పోయిందని అధికారులు ధృవీకరించారు. ఈ ప్రకంపనలతో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం శిథిలాలను తొలగించి, చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పశ్చిమ టర్కీలో 6.1 తీవ్రతతో భూకంపం