తదుపరి వార్తా కథనం

Earthquake: మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంప బీభత్సం.. 700కి పైగా మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 29, 2025
09:16 am
ఈ వార్తాకథనం ఏంటి
మయన్మార్, థాయ్‌లాండ్‌లో శుక్రవారం సంభవించిన రెండు భారీ భూకంపాలు ఈ దేశాలను తీవ్రంగా వణికించాయి. ఈ భూకంపాల ధాటికి మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
తాజా నివేదికల ప్రకారం, ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా రెండు దేశాల్లో కలిపి మరణించిన వారి సంఖ్య 700కు పైగా చేరుకుంది.
మయన్మార్‌లోనే కనీసం 694 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ మిలిటరీ అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే, థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో 10 మంది మరణించగా, ఒక భారీ భవనం కూలిపోవడంతో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు.
ఈ విపత్తు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని అమెరికా ఏజెన్సీ హెచ్చరించింది.