Page Loader
Earthquake: చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం
చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం

Earthquake: చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం

వ్రాసిన వారు Sirish Praharaju
May 16, 2025
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 6:59 గంటలకు ఈ భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇది రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ భూకంపంతో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించిందా అనే విషయమై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజి చేసిన ట్వీట్