LOADING...
Earthquake: రష్యాలో 7.8, ఇండోనేషియాలో 6.1 తీవ్రతతో భూకంపం

Earthquake: రష్యాలో 7.8, ఇండోనేషియాలో 6.1 తీవ్రతతో భూకంపం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2025
07:43 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలో భారీ భూకంపం సంభవించింది. గురువారం అర్ధరాత్రి తర్వాత పెట్రోపావ్లోవ్స్‌-కామ్చాట్‌స్కీ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 7.8గా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం భూమి అడుగున సుమారు 10 కి.మీ లోతులో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. మొదటి ప్రకంపనల అనంతరం 5.8 తీవ్రతతో మరికొన్ని ఆఫ్టర్‌షాక్స్‌ కూడా వచ్చినట్లు వివరాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా జాతీయ ఆరోగ్య సర్వీస్‌ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

వివరాలు 

6.1 తీవ్రతతో  ఇండోనేషియాలో  భూకంపం 

అయితే ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని సమాచారం అందింది. ఇక మరోవైపు, ఇండోనేషియాలో కూడా భూకంపం చోటుచేసుకుంది. సెంట్రల్‌ పపువా ప్రావిన్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయని అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం భూమి అడుగున సుమారు 28 కి.మీ లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రష్యాలో 7.8, ఇండోనేషియాలో 6.1 తీవ్రతతో భూకంపం