LOADING...
Indonesia bus accident: ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన  బస్సు, 15 మంది మృతి
బోల్తా పడిన  బస్సు, 15 మంది మృతి

Indonesia bus accident: ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన  బస్సు, 15 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2025
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేషియాలోని సెంట్రల్ జావా రాష్ట్రంలో తెల్లవారుజామున తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సెమరాంగ్ నగర పరిధిలో ఉన్న క్రాప్యాక్ టోల్ గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 15 మంది సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో 19 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం,ప్రమాదం జరిగిన సమయంలో బస్సు అత్యధిక వేగంతో ప్రయాణిస్తోంది. క్రాప్యాక్ టోల్ ఎగ్జిట్ కూడలికి చేరుకున్న సమయంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో, బస్సు రోడ్డుపై ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే సెమరాంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

వివరాలు 

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు గాయపడినవారు.. 

అయితే, బస్సు పూర్తిగా బోల్తా పడటం, కిటికీ అద్దాలు పగిలి లోపల అడ్డుగా పడటంతో రక్షణ చర్యలు క్లిష్టంగా మారాయని అధికారులు తెలిపారు. అనేక మంది ప్రయాణికులు బస్సు లోపలే ఇరుక్కుపోయారని, లోపలికి వెళ్లే మార్గం లేకపోవడంతో పగిలిన గ్లాసులను తొలగిస్తూ అత్యంత జాగ్రత్తగా బాధితులను బయటకు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముగిసినట్లు అధికారులు పేర్కొన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. అయితే, కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండోనేషియాలో ఘోర బస్సు ప్రమాదం

Advertisement