Jakarta Is Sinking: ఇండోనేషియా రాజధాని జకార్తాని మింగేస్తున్న సముద్రం .. కోటి మంది ప్రజల భవిష్యత్ ప్రశ్నార్ధకం ..
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియాలో అతిపెద్ద నగరమైన రాజధాని జకర్తా భయంకర వేగంతో మునిగిపోతుందంటూ తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. రాబోయే దశాబ్దాల్లో నగరం తీవ్రమైన నేల కుంచిత సమస్యను ఎదుర్కొనొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాజధాని కొంత భాగం త్వరలోనే నీటిలో కలిసిపోవచ్చని నిపుణుల అంచనా.అక్కడ నివసిస్తున్న కోట్లాది మందికి ఈ సంక్షోభం పెద్ద ఆందోళనగా మారింది. జకర్తా ఎందుకు ఇంత వేగంగా మునిగిపోతోంది? జకర్తా ప్రతి సంవత్సరం 1 నుండి 15 సెంటీమీటర్ల వరకు కుంగిపోతోంది.కొన్ని ప్రాంతాలు ఇంకా ఎక్కువ వేగంతో దిగజారుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. వెనిస్ సంవత్సరానికి కేవలం 0.08 అంగుళాలు మాత్రమే దిగుతుంది.ఈ తేడా జకర్తాలో పడిపోతున్న వేగం ఎంత తీవ్రమో చూపిస్తుంది. దాదాపు 40 శాతం ప్రాంతం ఇప్పటికే సముద్ర మట్టానికి కిందపడిపోయింది.
వివరాలు
జకర్తా భవిష్యత్తుకి ఇది ఏం సూచిస్తోంది?
2030 నాటికి పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మనుషుల కార్యకలాపాలే. అధికంగా గ్రౌండ్ వాటర్ పంపింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడం పెద్ద కారణంగా చెబుతున్నారు. రాబోయే సంవత్సరాల్లో అనేక ప్రాంతాలు శాశ్వతంగా మునిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎత్తుగా ఎగిసే అలలు సులభంగా నగరంలోకి చొచ్చుకురాగలవు. భారీ వర్షాలు ఇళ్లను నీటిమయ ప్రాంతాలుగా మార్చేయవచ్చు. నగరంలోని రహదారులు, ఇళ్లు, డ్రైనేజీ వ్యవస్థలు నిరంతరం దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా కొనసాగితే నివాసాలకు అనుకూలమైన భూమి తగ్గిపోతుంది. భారీ స్థాయిలో ప్రజల వలసలు తప్పవన్న ఆందోళన ఉంది.
వివరాలు
ఇతర నగరాలు జకర్తా సంక్షోభం నుంచి ఏమి నేర్చుకోవాలి?
ఈ పరిస్థితిపై పాలకులు ఇప్పటికే చర్చలు మొదలుపెట్టారు. తీర రక్షణ గోడలను బలపర్చే చర్యలు కూడా పరిశీలిస్తున్నారు. కొందరు నిపుణులు మునిగిపోతున్న ప్రాంతాల వద్ద అభివృద్ధిని ఆపాలని సూచిస్తున్నారు. మరికొందరు కఠినమైన గ్రౌండ్ వాటర్ నియంత్రణ అవసరమని చెబుతున్నారు. జకర్తాలోని పరిస్థితి ఇప్పుడు ప్రపంచవ్యాప్త ధోరణినే ప్రతిబింబిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. అనేక తీర నగరాలు, సముద్రమట్టం పెరుగుతున్న వేగాన్ని మించి, భూమి మరింత వేగంగా కుంగుతోంది. ఆసియాలో సంవత్సరానికి 2 సెంటీమీటర్లకుపైగా నేల కొంగుతున్ననగరాలు ఉన్నట్లు డేటా చూపిస్తోంది. ఇది ప్రపంచ సముద్రమట్టం పెరుగుతున్న వేగం కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ.
వివరాలు
దీర్ఘకాలిక నష్టాలను తగ్గించడంలో మన్నికైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కీలకం
మృదువైన డెల్టా ప్రాంతాల్లో నిర్మించిన పట్టణాలు తీవ్ర ప్రమాదంలో ఉంటాయి. అందుకే అభివృద్ధికి ముందు నీటి వినియోగాన్ని సుస్థిరంగా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రౌండ్ వాటర్‌ను నియంత్రణలో తీసి వినియోగించడం అత్యవసరం. తిరిగి భూగర్భ జలాలను నింపే ప్రోగ్రామ్‌లు ప్రయోజనకరంగా ఉంటాయి. బలమైన నిర్మాణ నియమాలు నేలపై ఒత్తిడిని తగ్గించవచ్చు. దీర్ఘకాలిక నష్టాలను తగ్గించడంలో మన్నికైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కీలకం. జకర్తాలోని పరిస్థితి నియంత్రణలేని పట్టణ విస్తరణ ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో స్పష్టంగా చూపిస్తోంది. అయితే, సమయానికి చర్యలు తీసుకుంటే పెద్ద నష్టాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.